కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి అస్తులు విలువెంతో తెలుసా..?

Worth over Rs 300 Cr 'on paper', Congress' richest MLA KomatiReddy RajGopal Reddy quits party. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Aug 2022 9:04 AM GMT
కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి అస్తులు విలువెంతో తెలుసా..?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం రానప్పటికీ.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని అందుకే వీడుతున్నానని ఆరోపించారు. రాజగోపాల్ పార్టీ నుంచి వైదొలగిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కూడా కాల్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై రాజ గోపాల్ తరచూ విమర్శలు గుప్పిస్తూ ఉండడంతో అంతర్గత పోరు స్పష్టంగా కనిపించింది.

కాంగ్రెస్‌కు మంచి పట్టున్న మునుగోడు నియోజకవర్గానికి మరోసారి ఉప ఎన్నిక జరగనుంది. తెలంగాణలోని అత్యంత ధనిక ఎమ్మెల్యేలలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. 2019 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ప్రకటించిన ఆస్తులు రూ. 300 కోట్లు. 2019 వరకు చేసిన ఆదాయపు పన్ను చెల్లింపులలో అతని ఆస్తులు 371% బాగా పెరిగాయని సూచించింది. రాజకీయవేత్తగా మారిన వ్యాపారవేత్త కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 నుండి 2014 వరకు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. 2018లో తెలంగాణ శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించారు.

5.01 కోట్ల విలువైన నగదు, నగలు, కార్లు రాజగోపాల్ రెడ్డికి ఉన్నాయి. అతని భార్య కె.లక్ష్మి రూ. 261.84 కోట్ల విలువైన సంపదను కలిగి ఉన్నారు.

షేర్లలో రూ.10,000 పెట్టుబడిని పెట్టినట్లు ప్రకటించారు. ఆయన భార్య లక్ష్మి డైరెక్టర్‌గా ఉన్న సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో రూ. 258 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం ఆ సంస్థ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టులను చూస్తోంది.

రాజ గోపాల్‌కు 35 లక్షల విలువైన 1,080 గ్రాముల బంగారం, ఆయన భార్య వద్ద రూ.1,38,17,554 విలువైన 3,996 గ్రాముల బంగారం; రూ.6,80,850 విలువైన 20 కిలోల వెండి, రూ.50 లక్షల విలువైన 30 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి.

స్థిరాస్తుల విలువ రూ.19,54,30,850 మరియు 27,91,18,60 ఉన్నాయి. మెదక్, నల్గొండ, రంగారెడ్డిలలో పెద్ద మొత్తంలో భూమిని కలిగి ఉన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్, సైబర్ స్పాజియోలో పెట్టుబడులు పెట్టారు.

రాజ గోపాల్ రెడ్డి, అతని భార్య లక్ష్మి ఇద్దరూ వాటాదారులుగా ఉన్న కంపెనీల ద్వారా 26 ప్రభుత్వ కాంట్రాక్టులు ఉన్నాయి. రాజ గోపాల్ రెడ్డి మొత్తం సంపద రూ. 24.55 కోట్లు కాగా, ఆయన భార్య ఆస్తుల విలువ రూ. 289.75 కోట్లు. ఈ జంటకు రూ. 314.31 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. రాజ గోపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ-హైదరాబాద్ లో ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.


Next Story