ముగ్గురు అమ్మాయిల పెళ్లి చేయాలి.. సౌదీ నుండి తిరిగి రాని భర్త

తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మహిళ తన భర్తను సౌదీ అరేబియా నుండి స్వదేశానికి రప్పించడంలో సహాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కోరింది.

By Medi Samrat  Published on  21 Dec 2024 4:55 AM GMT
ముగ్గురు అమ్మాయిల పెళ్లి చేయాలి.. సౌదీ నుండి తిరిగి రాని భర్త

తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మహిళ తన భర్తను సౌదీ అరేబియా నుండి స్వదేశానికి రప్పించడంలో సహాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కోరింది. జగిత్యాలలోని మేడిపల్లి గ్రామానికి చెందిన గూడూరి లత తన భర్తను తీసుకుని రావడానికి ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం ప్రవాసీ ప్రజావాణిలో మెమోరాండం సమర్పించారు. తన భర్త గూడూరి భూమేశ్వర్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని, కుటుంబసభ్యులతో సంబంధం లేకపోతోందని లత వివరించారు. ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్ల ఆర్థిక భారాన్ని మోయలేక అతను ఇంటికి తిరిగి రావడం లేదని వాపోయింది.

లత భర్త భూమేశ్వర్ ఏప్రిల్ 2014లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. తన కుటుంబంతో చివరిసారిగా ఏప్రిల్ 2023లో కాంటాక్ట్ అయ్యాడు. పునరుద్ధరించిన పాస్‌పోర్ట్‌తో సౌదీ అరేబియాకు వెళ్లగా, కుటుంబంతో ఎలాంటి కాంటాక్ట్ లేకుండా పోయింది. అతను సౌదీ అరేబియాలోని అభాలోని ముహయిల్‌లో నివసిస్తున్నాడు. లత, ఆమె కుమార్తెలు మెమోరాండం సమర్పించి భూమేశ్వర్‌ను కనుగొని భారతదేశానికి తిరిగి తీసుకునిరావడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

Next Story