ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) బస్సులో ఓ మహిళ ప్రసవించింది.

By Medi Samrat  Published on  5 July 2024 7:12 PM IST
ఆర్టీసీ బస్సులో ప్రసవించిన మహిళ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) బస్సులో ఓ మహిళ ప్రసవించింది. ఆమెకు మహిళా కండక్టర్, ఇతర ప్రయాణికులు సాయం చేశారు. శ్వేతా రత్నం అనే ప్రయాణికురాలు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ముషీరాబాద్ నుంచి బస్సులో వెళ్తున్న గర్భిణికి బహదూర్ పురా సమీపంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. బస్సులోని టీజీఎస్‌ఆర్‌టీసీ కండక్టర్‌ సరోజ, తోటి ప్రయాణికుల సహకారంతో మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పసికందు ఆరోగ్యంగా ఉంది. కండక్టర్ సరోజ, ఇతర మహిళా ప్రయాణీకులను TGSRTC మేనేజింగ్ డైరెక్టర్, V C సజ్జనార్ అభినందించారు.

"బస్సులోనే ప్రసవం.. మహిళా కండక్టర్ మానవత్వం

#TGSRTC బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు.

#Hyderabad ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్ బస్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్ లో ఎక్కారు. బహదూర్ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి.

ఈ విషయాన్ని గమనించిన కండక్టర్ ఆర్.సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు.

బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను #TGSRTC ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందనలు తెలియజేశారు.

అప్ర్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమని అన్నారు." అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Next Story