చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరీ విషయంలో సంగారెడ్డి జైలు అధికారులు తలలు పట్టుకున్నారు. ఆడ, మగ తేలకుండా ఏ బ్యారక్‌లోనూ ఉంచలేమని అధికారులు చెప్పారు. అఘోరీని తిరిగి పంపించిన సంగారెడ్డి జైలు అధికారులు లింగ నిర్థారణ జరిగితే గాని ఇక్కడ ఉంచుకోలేమని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది.
ఓ మహిళను మోసం చేసిన కేసులో అఘోరీని చేవెళ్ల కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. జైలుకు తరలిస్తున్న సమయంలో అఘోరీ తన భార్య వర్షిణిని తనతోనే ఉంచాలంటూ గట్టిగా అరిచాడు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదుతో మోకిలా పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్- మధ్య ప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు తెలంగాణకు తీసుకువచ్చారు.