క్యాన్సర్ తో పోరాడుతున్న భార్య.. భర్త చేసిన ఆ పనికి

క్యాన్సర్ తో పోరాడడం చిన్న విషయమేమీ కాదు. క్యాన్సర్ తో బాధపడే వ్యక్తికే కాకుండా కుటుంబానికి

By Medi Samrat  Published on  4 Sept 2023 8:29 PM IST
క్యాన్సర్ తో పోరాడుతున్న భార్య.. భర్త చేసిన ఆ పనికి

క్యాన్సర్ తో పోరాడడం చిన్న విషయమేమీ కాదు. క్యాన్సర్ తో బాధపడే వ్యక్తికే కాకుండా కుటుంబానికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వాములు నరకం అనుభవిస్తూ ఉంటారు. తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న భార్యకు సంఘీభావంగా ఓ భర్త తన తలను గుండు చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియోలో తన భార్యకు భర్త మద్దతును ఇచ్చాడు.

భార్య ఏడుస్తున్నప్పుడు భర్త తల షేవింగ్ చేస్తూ కనిపించాడు. భార్య తలను షేవ్ చేసిన తర్వాత, అతను ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ తీసుకొని తన తలని షేవ్ చేసుకున్నాడు. అతను తల గుండు చేయించుకోవడం చూసి భార్య మరింత ఉద్వేగానికి లోనైంది. ఈ వీడియోకి ఇప్పటికే 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Next Story