మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌.. రేపు దుకాణాలు బంద్.!

మందుబాబుల‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం రాచకొండ పోలీసు కమిషనరేట్​పరిధిలోని మద్యం షాపులు మూసి ఉంటాయని

By Medi Samrat  Published on  16 April 2024 11:16 AM IST
మందుబాబుల‌కు బ్యాడ్ న్యూస్‌.. రేపు దుకాణాలు బంద్.!

మందుబాబుల‌కు గ‌ట్టి షాక్ త‌గిలింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని బుధవారం రాచకొండ పోలీసు కమిషనరేట్​పరిధిలోని మద్యం షాపులు మూసి ఉంటాయని రాచకొండ కమిషనర్​ తరుణ్​జోషి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఊరేగింపు సంద‌ర్భంగా ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు. ఈ నేప‌ధ్యంలోనే ఒకరోజు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కల్లు దుకాణాలు, వైన్స్​, బార్​అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, క్లబ్స్​ బుధ‌వారం ఉదయం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు మూసి వేయాలని.. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Next Story