ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడనున్నాయా.?
ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
By అంజి
ప్రతి ఆదివారం బంకులు మూతపడనున్నాయా.?
ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇక నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పని చేయవని వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్ బంకులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆ వీడియోలో ఉంది. పలు మీడియా సంస్థలు కూడా నిజనిర్ధారణ చేసుకోకుండానే ప్రజలను తప్పదారి పట్టించేలా వైరల్ అవుతున్న వీడియోను ప్రచారం చేస్తున్నాయి.
పెట్రోల్ బంకులు పని చేయవంటూ వైరల్ అవుతోన్న వీడియో.. 2017 నాటిదని తెలుస్తోంది. 2017 ఏడాదిలో మన్‌కీబాత్‌లో ప్రధాని మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడటానికి చమురును ఆదా చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇంధన వనరుల వాడకం తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటిస్తున్నట్టు పెట్రోల్ బంకుల యజమానుల సంఘం తెలిపింది. అయితే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయమేదీ తీసుకున్నట్టు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వైరల్ అవుతున్న వీడియో పాతది.