లగచర్ల ఘటనలో అరెస్టై జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లగచర్ల దాడి ఘటనలో పోలీసులు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయడాన్ని పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఒకే సంఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయవద్దన్న సుప్రీంకోర్టు తీర్పులను పట్నం నరేందర్ రెడ్డి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
లగచర్ల గ్రామ రైతులకు మద్దతుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ‘మహా ధర్నా’ చేపట్టింది. మహబూబాబాద్ జిల్లా మానుకోటలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో బిఆర్‌ఎస్ నాయకులు సత్యవతి రాథోడ్, ఎం.కవిత, ఇ.దయాకర్‌రావు, మధుసూధనాచారి, ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.