కేంద్రప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విధానాలపై సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. తాజాగా మళ్లీ వ్యంగ్యాస్త్రం సంధించారు. గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును మార్చడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియాన్ని నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారని, ఇప్పుడు ఎల్‌జీ మెడికల్ కాలేజీకి మోదీ పేరు పెట్టడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఉంటే.. త్వరలోనే ఆర్భీణ ముద్రించే కరెన్సీ నోట్లపైనా గాంధీ బొమ్మ బదులు నరేంద్ర మోదీ ముద్రిస్తారేమోనని ఎద్దేవా చేశారు.
"ఇప్పటికే సర్దార్ పటేల్ స్టేడియం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా జీకి మార్గం ఉంటే.. మహాత్మా గాంధీజీ స్థానంలో మోడీ కొత్త కరెన్సీ నోట్లను ముద్రించమని ఆర్బీఐకి త్వరలో ఆదేశించవచ్చు" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.