'ఒకే దేశం.. ఒకే ఎంఎస్‌పీ ఎందుకు ఇవ్వడం లేదు?'.. కేంద్రాన్ని ప్రశ్నించిన హరీశ్‌ రావు

రైతులను ఆదుకునేందుకు ‘వన్ నేషన్ వన్ ఎంఎస్‌పి’ని ఎందుకు తీసుకురావడం లేదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అక్టోబర్ 16 బుధవారం కేంద్రాన్ని ప్రశ్నించారు.

By అంజి  Published on  17 Oct 2024 12:19 PM IST
one Nation one MSP, BRS MLA, Harish Rao, Central Govt, Telangana

'ఒకే దేశం.. ఒకే ఎంఎస్‌పీ ఎందుకు ఇవ్వడం లేదు?'.. కేంద్రాన్ని ప్రశ్నించిన హరీశ్‌ రావు

హైదరాబాద్: రైతులను ఆదుకునేందుకు ‘వన్ నేషన్ వన్ ఎంఎస్‌పి’ని ఎందుకు తీసుకురావడం లేదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే టీ హరీశ్ రావు అక్టోబర్ 16 బుధవారం కేంద్రాన్ని ప్రశ్నించారు. పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. కేంద్రం పత్తి కొనుగోళ్లలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మద్దతు ధర ఎందుకు చెల్లిస్తోంది? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేస్తారని మాజీ ఆర్థిక మంత్రి చెప్పారు.

అయితే, కేంద్రం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)గా గుజరాత్‌ నుంచి క్వింటాల్‌కు రూ. 8,257 చొప్పున కొనుగోలు చేస్తుండగా, తెలంగాణ నుంచి క్వింటాల్‌కు రూ. 7,521 మాత్రమే పత్తిని కొనుగోలు చేస్తోందని అన్నారు.

కేంద్రం యొక్క “వన్ నేషన్ వన్ ఎలక్షన్”, “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్”, “వన్ నేషన్ వన్ టాక్స్”, “వన్ నేషన్ వన్ మార్కెట్” అంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం వన్‌ నేషన్‌ ఎన్‌ ఎంఎస్‌పీ ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "ఒక దేశం ఒక ఎంఎస్‌పీ" విధానాన్ని తీసుకురావడానికి కేంద్రం ఎందుకు వెనుకాడుతోందని అన్నారు. తెలంగాణపై కేంద్రం ఉదాసీన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story