ఢిల్లీ లిక్క‌ర్ స్కాం : ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక ఎండీ పాత్ర ఎంత‌..?

Why is Telugu daily Andhra Prabha, India Ahead channel MD Goutham Mootha under ED lens. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో హైదరాబాద్ వ్యాపారవేత్త బోయిన్‌పల్లి అభిషేక్‌రావును

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2022 10:29 AM GMT
ఢిల్లీ లిక్క‌ర్ స్కాం : ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక ఎండీ పాత్ర ఎంత‌..?

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో హైదరాబాద్ వ్యాపారవేత్త బోయిన్‌పల్లి అభిషేక్‌రావును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసిన మరుసటి రోజు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలుగు దినపత్రిక 'ఆంధ్రప్రభ' దినపత్రిక, ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ 'ఇండియా ఎహెడ్' మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ముత్తాకు సమన్లు ​​పంపింది. జ్యూస్ నెట్‌వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో గౌతమ్ ను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

గౌతమ్‌ ముత్తాపై సీబీఐ ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. అంతేకాకుండా ఆయన పాత్రను నిర్ధారించలేదు. అయితే, అక్టోబర్ 4న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రభ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారని కథనాలు వచ్చాయి. ఆంధ్రప్రభ తెలంగాణలోని ప్రముఖ తెలుగు దినపత్రికలలో ఒకటి.. ఆ గ్రూప్ న్యూస్ ఛానెల్ `ఇండియా ఎహెడ్' న్యూఢిల్లీలో ఉంది.

'Zeus Networking Private Limited,' హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న కంపెనీ. మే 2010లో స్థాపించబడింది. ఇది ప్రాథమికంగా ఇతర సంస్థల వెబ్‌సైట్‌ల నిర్వహణ, ఇతర సంస్థల కోసం మల్టీమీడియా ప్రెజెంటేషన్‌లను రూపొందించడం వంటి వాటితో వ్యవహరించే ఒక IT కంపెనీ. జ్యూస్ నెట్‌వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు.. గౌతమ్ ముత్తా, బోయిన్‌పల్లి అభిషేక్ రావు. ఆర్థిక రికార్డుల ప్రకారం అత్యధిక కాలం డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తి బోయిన్‌పల్లి అభిషేక్‌రావు. అతను అక్టోబర్ 6, 2021న నియమించబడ్డాడు. అయితే, గౌతమ్ ముత్తా 2022లో కంపెనీలో చేరారు. ఫిబ్రవరి 11, 2022న డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గౌతమ్ ముత్తా 10 కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మొత్తంగా.. కంపెనీ 17 ఇతర కంపెనీలకు కనెక్ట్ చేయబడింది. "ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గౌతమ్ ముత్తాకు సమన్లు ​​జారీ చేశారు. జ్యూస్ నెట్‌వర్కింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో లింక్స్ ఉన్నాయని దర్యాప్తు కనుగొంది" అని ఏజెన్సీ వర్గాలు న్యూస్‌మీటర్‌కి తెలిపాయి.

కీలకంగా మారిన అభిషేక్ రావుతో గౌతమ్ ముత్తాకు అనుబంధం..?

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌పై విచారణలో బోయిన్‌పల్లి అభిషేక్‌రావు సహ నిందితుడు సమీర్ మహేంద్రు నుంచి ప్రభుత్వ అధికారులకు `కమీషన్' చెల్లించేందుకు రూ.3.85 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. ఈ డబ్బును అతని ఘోస్ట్ కంపెనీ 'రాబిన్ డిస్ట్రిబ్యూషన్' ద్వారా మళ్లించాల్సి ఉంది. సమీర్ మహేంద్రుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఢిల్లీలోని ప్రభుత్వోద్యోగులకు సూట్‌కేస్ కంపెనీ 'రాబిన్ డిస్ట్రిబ్యూషన్' ద్వారా కమీషన్ మళ్లించబడిందని వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో మరో సహ నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యాపార భాగస్వామి, టీఆర్‌ఎస్ అగ్రనేతకు నమ్మకస్తుడైన బోయిన్‌పల్లి అభిషేక్ రావు ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు. అభిషేక్, అరుణ్ రామచంద్ర పిళ్లై రాబిన్ డిస్ట్రిబ్యూషన్‌కి కో-డైరెక్టర్‌లు. జూలై 2022లో స్థాపించబడిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ LLP కంపెనీ, సికింద్రాబాద్‌లోని బ్యూటీ పార్లర్ కు ఖచ్చితమైన చిరునామాను కలిగి ఉంది. అధికారిక పత్రాల్లో పేర్కొన్న చిరునామా బ్యూటీ సెలూన్. ఇది ఘోస్ట్ కంపెనీ అని సూచిస్తుంది. రాబిన్ డిస్ట్రిబ్యూషన్ LLP అనేది కేవలం కాగితంపై మాత్రమే ఉన్న డొల్ల కంపెనీ అని పరిశోధనలో వెల్లడైంది.

సీబీఐ కేసు నమోదు చేసిన 16 మందిలో హైదరాబాద్‌లోని కోకాపేటకు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా ఉన్నారు. అతను ఇండో స్పిరిట్‌కు చెందిన సమీర్ మహేంద్రు (సహ నిందితుడు) నుండి అనవసరమైన డబ్బును తీసుకుని విజయ్ నాయర్ ద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వోద్యోగికి ఇచ్చే వ్యక్తి అని నివేదించబడింది.

బోయిన్‌పల్లి అభిషేక్ అనేక మంది మద్యం వ్యాపారుల కోసం లాబీయింగ్ చేస్తున్నాడని కూడా ప్రచారంలో ఉంది. సమీర్ మహేంద్రుతో ఉన్న అనుబంధంపై అభిషేక్‌ను ప్రశ్నించారు. ఆదివారం సీబీఐ-ఢిల్లీ విభాగం అతన్ని విచారణకు పిలిచి, అదే రోజు సాయంత్రం అరెస్టు చేశారు. అభిషేక్‌రావు దక్షిణాది లాబీగా వ్యవహరిస్తున్నారని, కార్టెలైజేషన్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. అతను సమీర్ నుండి రూ. 3.85 కోట్లను తీసుకున్నాడని సంబంధిత వర్గాలు న్యూస్‌మీటర్‌కి తెలిపాయి.

ఇప్పటివరకు బోయిన్‌పల్లి అభిషేక్ రావు, ఎం/ఎస్ ఓన్లీ మచ్ లౌడర్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ మాజీ సీఈవో విజయ్ నాయర్‌లను సీబీఐ అరెస్ట్ చేయగా, ఢిల్లీలోని ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.


Next Story