తెలంగాణకు భారీ వర్ష సూచన.. హైదరాబాద్ కు కూడా!!
తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది
By Medi Samrat Published on 7 Jun 2024 2:45 PM GMTతెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ విభాగం. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి మెదక్ వరకు నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉండగా ఇక తెలంగాణ అంతటా కూడా విస్తరించబోతున్నాయి. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ కారణంగా మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కొనసాగుతోంది. బలమైన ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Next Story