స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం తరుపున మా వాదనలు బలంగా వినిపించామని తెలిపారు. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. సభలో మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా మద్దతు ఇచ్చారు. బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృశ్య రాజకీయాలకు పోకుండా ఐక్యంగా ఉండాలని కోరారు. చర్చల్లో సభ ఏకగ్రీవ తీర్మానంపై జరిగింది.. కోర్టులో అఫిడవిట్‌లు ఉండవు.. ఇంప్లీడ్ కావాలని కోరామని పేర్కొన్నారు.
కుల సర్వేలో మీరు పాల్గొనలేదు.. ప్రజలు 97 శాతం సర్వేలో పాల్గొన్నారని బీఆర్ఎస్ నేతలను దుయ్యబట్టారు. ఎంపైరికల్ డేటాకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ వేసుకొని 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం.. రాజకీయాలు పక్కన పెట్టీ సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బిఆర్ఎస్, ఏంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలని కోరారు.