వచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తాం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా సీట్లు సాధిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో
By అంజి Published on 27 April 2023 11:03 AM GMTవచ్చే ఎన్నికల్లో 100కుపైగా సీట్లు గెలుస్తాం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా సీట్లు సాధిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ప్లీనరీకి హాజరైన పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ''రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతో తెలంగాణ సాధించుకున్నాం. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలిపాం. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ముందుకు సాగుతున్నాం'' అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.
అకాల వర్షాలు పడకముందే పంటకోతలు పూర్తయ్యేలా రైతులను చైతన్యం చేయాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా సాగుతోందని, అందుకే పెట్టుబడులు తరలి వస్తున్నాయని అన్నారు. తెలివి ఉంటే బండ మీద కూడా నూకలు పుట్టించుకోవచ్చన్న కేసీఆర్.. కరెంటు, రోడ్డు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్యసందప, ఇలా ప్రతీరంగంలో దేశం ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ ప్రగతిని నమోదు చేసిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ''మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 సీట్లు సాధించాం. వచ్చే ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం'' అని అన్నారు.