రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 'గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్' సంఘటనపై తక్షణం స్పందించారు. జరిగిన ఘటనపై 108 - COO ఖాలీద్ ను విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తు లో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 108 సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. అత్యవసర పరిస్థితులలో రోగులకు సేవలు అందించే 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. గిరిజన, గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్, పట్టణ ప్రాంతాలలో ఏదైనా అత్యవసర పరిస్థితులలో 108 నెంబర్ కు సమాచారం వచ్చిన వెంటనే మిషన్ ఆఫ్ సేవింగ్ లైవ్స్ లో భాగంగా అత్యల్ప సమయం లో ఘటనాస్థలానికి వేగంగా చేరుకొని ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గర లోని ఆసుపత్రికి తరలిస్తారన్నారు . అత్యల్ప సమయంలో ఘటన స్థలానికి వేగంగా చేరుకుని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించి తక్షణ చికిత్స ను Saving the Lives లో వైద్య సేవలు అందేవిధంగా భౌగోళికంగా నెట్వర్క్ ను రూపొందిస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.