బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ సాగుతోంది. కేటీఆర్ కేంద్రంపై విమర్శలు చేయగా.. అందుకు బీజేపీ ఛీప్
బండి సంజయ్ సెటైరికల్‌గా స్పందించారు.
'ఆదాయం: అదానీకి..
వ్యయం: జనానికి, బ్యాంకులకు.
అవమానం: నెహ్రూకి..
రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!.
బస్, బభ్రాజీమానం భజగోవిందం. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆయన ట్వీట్ చేసిన కాసేపటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ గా ట్వీట్ చేశారు.
'ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి..
వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి.
అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు.
రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు!!
తుస్.. పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాయితీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే' అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.