వీహెచ్‌ను పరామర్శించిన‌ ఉపరాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు

Vise President Venkaiah Naidu Phone Call To VH. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు వీహెచ్‌(హ‌నుమంత‌రావు)

By Medi Samrat  Published on  12 July 2021 5:21 AM GMT
వీహెచ్‌ను పరామర్శించిన‌ ఉపరాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు వీహెచ్‌(హ‌నుమంత‌రావు) కిడ్నీ సమస్యతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలిసిన ప‌లువురు ఇప్ప‌టికే ఆయ‌న‌కు ఫోన్ చేసి పరామర్శించారు. స్వ‌యంగా వెళ్లి క‌లిసి ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని గురించి తెలుసుకున్నారు. అయితే.. తాజాగా ఉపరాష్ట్ర‌ప‌తి వెంకయ్యనాయుడు కూడా వీహెచ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.

తీహెచ్ ప్ర‌స్తుతం అపోలో ఆసుపత్రిలో కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్నారు. వీహెచ్‌కు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ల సలహాలు ఖచ్చితంగా పాటించాలని వీహెచ్‌కు వెంకయ్య నాయుడు సూచించారు. ఆరోగ్యం కోలుకుని తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని వీహెచ్‌కు చెప్పారు. కాగా, తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యనాయుడుకు వీహెచ్‌ ధన్యవాదాలు తెలిపారు. మీ పరామర్శతో నాకు చాలా ఉత్సాహం వచ్చిందని వెంకయ్యనాయుడుకు చెప్పారు వీహెచ్‌.


Next Story