Video : వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేసిన జనం

వికారాబాద్‌లోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై సమాచారం సేకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కాస్తా ఉద్రిక్తంగా నెలకొంది

By Medi Samrat  Published on  11 Nov 2024 2:41 PM IST
Video : వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌పై దాడి చేసిన జనం

వికారాబాద్‌లోని దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై సమాచారం సేకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కాస్తా ఉద్రిక్తంగా నెలకొంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులను కలిసి రాగా రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సమావేశంలో కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులను అధికారులు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అసహనానికి గురైన గ్రామస్థులు రాళ్లదాడికి దిగారు. అధికారుల వాహనాలపై కర్రలతో దాడి చేశారు.

ఇద్దరు మహిళలు కలెక్టర్ జైన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా సిబ్బంది ఆయన్ను రక్షించారు. కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన ఒక అధికారినితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి నుండి అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన తరువాత ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేసుకున్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

అయితే తనపై ఎవరూ దాడి చేయలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని.. ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని కలెక్టర్ తెలిపారు. అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరన్నారు.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ఎవరూ ఆందోళన చేయవద్దని కలెక్టర్ సూచించారు.

Next Story