కేసీఆర్ పర్యటనలు ఆప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి

Vijayashanti Slams CM KCR. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌పై

By Medi Samrat  Published on  22 Jun 2021 2:03 PM GMT
కేసీఆర్ పర్యటనలు ఆప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌పై ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందిస్తూ.. కేసీఆర్ గారి పర్యటనలు ఆప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయి. ఈ పిచ్చి పర్యటనలు, మోసపు వాగ్దానాల వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అరెస్టులు, వేధింపుల కోసమే అన్నటుగా కేసీఆర్ పర్యటన ఉంది. ప్రజల్ని రోడ్ల మీదకు రానివ్వకుండా ఎక్కడిక్కడ బారికేడ్లు పెట్టి అడ్డుకోవడం కేసిఆర్‌కే చెల్లింది. కేసిఆర్ జిల్లాలకు వస్తే ఇంత నిర్బంధం ఉంటుందంటే... దాని బదులు ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండడమే మంచిదని ప్రజలు అంటున్నరు.

హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ గారికి అక్కడికి పోయే ధైర్యం లేకనే అటుపక్క సిద్ధిపేట జిల్లా, ఇటుపక్క వరంగల్ జిల్లా, పక్కనున్న యాదాద్రి జిల్లా పర్యటన చేస్తున్నట్లు అభిప్రాయం కలుగుతోంది. ఈ పర్యటనలో కొందరు పోలీసు అధికారులు.. కనీసం ప్రతిపక్ష నాయకులనే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. అది వారికీ, మంచిది కాదు. అయినా.. పేరుకి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తప్ప.. ఈ ప్రచార ఆర్భాటపు ముఖ్యమంత్రి గారి కాలక్షేపం పర్యటన వల్ల ప్రజల, నిరుద్యోగుల గతి మారుతున్నది ఏమీ లేదని విమ‌ర్శ‌లు చేశారు.


Next Story
Share it