ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కేటీఆర్ ఎందుకు నిలదీయరు.? : విజయశాంతి
Vijayashanti Fires On TRS. "ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకు?" అని ఈ రోజు ఒక ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన
By Medi Samrat Published on
25 Nov 2020 4:49 AM GMT

"ముస్లింలపై అంత గుడ్డి ద్వేషం ఎందుకు?" అని ఈ రోజు ఒక ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నించిన మంత్రి కేటీఆర్ గారు.. ఇన్నేళ్ళూ టీఆర్ఎస్ మిత్రపక్షంగా (ఇప్పుడు కాదని చెప్పుకుంటున్నారు) ఉంటూ వచ్చిన ఎంఐఎం పార్టీ ప్రముఖ నేత గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తులేనట్టు వ్యవహరిస్తున్నారని విజయశాంతి అన్నారు.
ఆ ఎంఐఎం పార్టీ ప్రముఖ నేత గతంలో తమవారిని 15 నిమిషాలు వదిలిపెడితే హిందువుల జనాభా నిష్పత్తిని వారి మతస్తుల జనాభాతో సమానం చేస్తాన్నాడని.. తన వర్గం వారంతా కలసి ఉమ్మువేస్తే చాలు చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి ఆలయం కూలిపోతుందని పరిహాసం చేశాడని.. హిందువులు పవిత్రంగా ఆరాధించే గోమాతను ఉద్దేశించి చులకనగా మాట్లాడాడని.. "హిందువులపై అంత గుడ్డి ద్వేషమెందుకు?" అని ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కేటీఆర్ గారు ఎందుకు నిలదీయలేదు? దీన్ని బట్టి చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్ఎస్ మత రాజకీయాలకు తెగబడుతోందని స్పష్టమవుతోందని విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.
Next Story