అలా అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా..? అసద్‌కు విజయశాంతి కౌంటర్
Vijayashanti Counter To Asaduddin Owaisi. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు.
By Medi Samrat Published on 8 Jun 2021 11:57 AM GMT
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజమని ఆమె అన్నారు. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయని.. 2020 జూలైలో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? అని ఆమె ఓవైసీ ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గార్కి చెప్పలేదా..? 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్ కి ఇవ్వటం వీఐపీ కల్చర్ అయితే.. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా..? అని ఒవైసీ ని ప్రశ్నించారు విజయశాంతి.
అంతకుముందు ఓవైసీ మాట్లాడుతూ.. మోదీ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంటున్నారు.. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందని అన్నారు. 2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదని అన్నారు. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారని.. ప్రధాని మోదీ వీఐపీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వ్యాక్సిన్ పనిచేయదని చెప్పిన బాబాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓవైసీ కేంద్రాన్ని ప్రశ్నించారు. వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని.. నాతో సహా కుటుంబసభ్యులందరూ వ్యాక్సిన్ తీసుకున్నామని.. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు.
Next Story