కేసీఆర్ సర్వేలపై విజయశాంతి ఆస‌క్తిక‌ర కామెంట్స్‌

Vijayashanti Comments On CM KCR. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజ‌య‌శాంతి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

By Medi Samrat
Published on : 27 Feb 2021 6:45 PM IST

కేసీఆర్ సర్వేలపై విజయశాంతి ఆస‌క్తిక‌ర కామెంట్స్‌

సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజ‌య‌శాంతి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తామే గెలుస్తామని సీఎం కేసీఆర్‌ పర్సెంటేజి లెక్కలతో చెప్పుకోవటం హాస్యాస్పదమ‌ని బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి అన్నారు. అసలు టీఆర్ఎస్ నిలబెట్టే అభ్యర్థి కబ్జాకోరో.. దోపిడీదారో తెలిసినంక ప్రజలు ఏ స్థానం ఇయ్యాలో నిర్ణయిస్తారని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్యమంత్రి ఊహాగానాలు కూడా ఆమె కామెంట్లు చేశారు. కేసీఆర్ వి అన్నీ అవకతవక పిచ్చి సర్వేలని నేను గతంలోనే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు చెప్పడం జ‌రిగింద‌ని.. ఫ‌‌లితాలు అదే తీరున రావ‌డం జరిగిందని అన్నారు. బండి సంజయ్ కు లోకసభ స్పీకర్ అనుమతి లభించినట్లయితే.. ఈ అసత్యాల ముఖ్యమంత్రి అనేక మోసాలలో మరొక్కటి బయటపడి, ప్రజలకు మరింత స్పష్టత ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.


Next Story