బీఆర్ఎస్ ఉండ‌ద‌న్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు

తెలంగాణల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి త‌ప్పుబ‌ట్టారు

By Medi Samrat  Published on  17 May 2024 2:53 AM GMT
బీఆర్ఎస్ ఉండ‌ద‌న్న కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదు

తెలంగాణల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని కాంగ్రెస్ నాయ‌కురాలు విజ‌య‌శాంతి త‌ప్పుబ‌ట్టారు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అన్నారు. ఎప్పటికీ ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత వంటి వారి నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాక‌ ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించు కోవాల్సిన తప్పని అవసరం ఉంద‌న్నారు. ఎన్నడైనా.. వాస్తవం.. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశమ‌ని కిషన్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌పై స్పందించారు. ఇదిలావుంటే.. విజ‌య‌శాంతి ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా బీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తుగా విజ‌య‌శాంతి వ్యాఖ్య‌నించ‌డంపై మ‌ర‌లా పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారా లేక కేవ‌లం ఖండ‌న మాత్ర‌మేనా అనే అభిప్రాయం అంద‌రిలో వ్య‌క్తమ‌వుతుంది.

Next Story