Video: వృద్ధ రైతుపై పోలీసు దాష్టీకం..సర్వత్రా విమర్శలు

నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధ రైతుపై ఏఎస్‌ఐ అమానవీయంగా ప్రవర్తించారు

By Knakam Karthik
Published on : 4 Jun 2025 4:33 PM IST

Telangana, Adilabad District, Farmer, ASI, Congress Government

Video: వృద్ధ రైతుపై పోలీసు దాష్టీకం..సర్వత్రా విమర్శలు

నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఓ వృద్ధ రైతుపై ఏఎస్‌ఐ అమానవీయంగా ప్రవర్తించారు. భూ సమస్య చెప్పుకుందామని వెళ్లిన ఓ వృద్ధ రైతును బయటికి గెంటివేశారు. లైన్‌లో రాకుండా కాస్త ముందుకు వెళ్లాడని లాగేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హరీష్ రావు ఆగ్రహం..

కాగా వృద్ధ రైతుపై పోలీసు చేయి చేసుకోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ.. సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన ? సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా? నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు? నేడు ఖానాపూర్ లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారు? ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుపై చేయి వేసిన పోలీసుపై వెంటనే తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం...అని హరీష్‌ రావు ట్వీట్ చేశారు.

Next Story