ఉపరాష్ట్రపతి ఇంట పెళ్లి సంద‌డి.. తరలివచ్చిన ప్రముఖులు

Vice President Venkaiah Naidu Granddaughter Wedding.ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Dec 2021 4:15 AM GMT
ఉపరాష్ట్రపతి ఇంట పెళ్లి సంద‌డి.. తరలివచ్చిన ప్రముఖులు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి మనవరాలి వివాహం శంషాబాద్ విమానాశ్ర‌యం జీఎంఆర్ ఏరినాలో క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్-రాధ దంపతుల కుమార్తె నిహారిక.. హైదరాబాద్‌కు చెందిన రవితేజను వివాహం చేసుకున్నారు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన ఈ వివాహానికి ప‌లువురు ప్ర‌ముఖులు త‌ర‌లివ‌చ్చారు.


ఈ వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దంప‌తులు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు హాజరయ్యారు. టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్, అక్కినేని నాగార్జున తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.


Next Story
Share it