ల‌డ్డూ వివాదంపై సీబీఐ విచారణ కోరుతూ దీక్ష‌కు దిగిన వీహెచ్‌

తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన‌ చ‌ర్చ న‌డుస్తుంది. గ‌తంలో ఈ విష‌య‌మై స్పందించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్‌) ఇప్పుడు ఏకంగా దీక్ష‌కు దిగారు

By Medi Samrat  Published on  24 Sept 2024 11:09 AM IST
ల‌డ్డూ వివాదంపై సీబీఐ విచారణ కోరుతూ దీక్ష‌కు దిగిన వీహెచ్‌

తిరుప‌తి ల‌డ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా తీవ్రమైన‌ చ‌ర్చ న‌డుస్తుంది. గ‌తంలో ఈ విష‌య‌మై స్పందించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హనుమంతరావు(వీహెచ్‌) ఇప్పుడు ఏకంగా దీక్ష‌కు దిగారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి లిబర్టీ టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మాజీ ఎంపీ హనుమంతరావు దీక్ష చేప‌ట్టారు. తిరుమ‌ల‌లో పవిత్రమైన లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ హనుమంతరావు దీక్షకు కూర్చున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవాలయం వద్ద ఆయ‌న‌ మీడియాతో మాట్లాడనున్నారు.

గ‌తంలో ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమ‌ల‌ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో చేప కొవ్వు, ఎద్దు కొవ్వుతో ప్రసాదం చేయడం ఏంటి? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేవుడు దగ్గరే కరప్షన్ చేస్తారా.? అని ప్ర‌శ్నించారు. తప్పు చేసింది ఎవరైనా సరే.. దేవుడు వారిని ఊరికే వదలడన్నారు. టీడీపీ వాళ్లు కావాలని ఆరోపణ చేస్తున్నారు అని ప్రతిపక్షం అనే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈరోజే ఈ విషయంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాన‌న్నారు. దేవుడికి అన్యాయం జరిగింది కనుక వెంటనే దీని వెనక ఎవరున్నా కనిపెట్టి వారికి శిక్ష వేయాలన్నారు.

Next Story