దొరలకు లాభం చేసేందుకే ధరణి
VH Fire on CM KCR. ధరణి ఎందుకు తీసుకొచ్చారో కేసీఆర్ కు అయినా తెలుసా అని కాంగ్రెస్ సీనియర్ నేత
By Medi Samrat Published on
6 July 2022 9:09 AM GMT

ధరణి ఎందుకు తీసుకొచ్చారో కేసీఆర్ కు అయినా తెలుసా అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు ప్రశ్నించారు. బుధవారం ధరణి కార్యక్రమంపై జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వీహెచ్,. అనంతరం మాట్లాడుతూ.. దొరలకు లాభం చేసేందుకే ధరణిని తీసుకొచ్చారని విమర్శించారు. దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత ఇంధిరాగాందిదే అని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పేదల భూములను పెద్దలకు రాసిచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే లోపు ఉన్న భూములు మాయం చేస్తారని.. ఎల్లుండి హెచ్ ఎండీఏ ముందు నిరసన చేస్తామని తెలిపారు.
Next Story