కోలుకున్న వీహెచ్‌.. పీసీసీ కొత్త క‌మిటీపై ఏమ‌న్నారంటే..

VH About New PCC Committee. కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న వీహెచ్ ఇటీవ‌ల డిచ్ఛార్జ్ అయ్యారు.

By Medi Samrat  Published on  24 July 2021 3:38 PM IST
కోలుకున్న వీహెచ్‌.. పీసీసీ కొత్త క‌మిటీపై ఏమ‌న్నారంటే..

కిడ్నీ సంబంధిత స‌మ‌స్య‌తో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న వీహెచ్ ఇటీవ‌ల డిచ్ఛార్జ్ అయ్యారు. పూర్తిగా కోలుకున్న అనంత‌రం నేడు అంబర్పేట్ లోని ఆయ‌న‌ నివాసంలో మీడియాతో ముచ్చ‌టించారు. నా ఆరోగ్యం విషయంలో మా అధ్య‌క్షురాలు సోనియాగాంధీ పాటు ఇతర నాయకులూ అందరు నన్ను పరామర్శించారని అన్నారు. చాల మంది హాస్పిటల్ కి నన్ను కలవడానికి వచ్చారు.. అందరకి కృతజ్ఞతలు తెలిపారు.

బడుగు బలహీన వర్గాల వాళ్లకి నా సేవలు అవసరమని సోనియాగాంధీ తెలిపారని.. రాజకీయాల్లోకి సేవ చేయాలని వచ్చాను.. అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి రాలేదని.. సోనియా గాంధీ నాతో మాట్లాడటం వల్ల నాకు మరింత ధైర్యం పెరిగింద‌ని అన్నారు. నా మిగతా జీవితం అంత బడుగు, బలహీన వర్గాలకి సేవ చేస్తానని తెలిపారు.

ఎక్కడ పేదవారికి ఆపద ఉన్న ఆదుకునే పవన్ కళ్యాణ్ నా అరోగ్య విషయంలో నాకు లెటర్ రాసారని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని.. నేను ఎక్కడ ఆపద ఉన్నా.. అక్కడ ఉంటానని తెలిపారు. సోనియా గాంధీని కలిసిన తరువాత పీసీసీ కొత్త కమిటీ.. పాత కమిటీ గురించి మాట్లాడతానని.. అప్పటివరకూ ఏం మాట్లాడన‌ని వీహెచ్ అన్నారు.


Next Story