తెలంగాణ ఉమెన్స్‌ కమిషన్‌కు వేణు స్వామి బహిరంగ క్షమాపణలు

తెలంగాణ మ‌హిళా కమిషన్‌కు జోతిష్యుడు వేణు స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారు.

By Medi Samrat  Published on  21 Jan 2025 6:33 PM IST
తెలంగాణ ఉమెన్స్‌ కమిషన్‌కు వేణు స్వామి బహిరంగ క్షమాపణలు

తెలంగాణ మ‌హిళా కమిషన్‌కు జోతిష్యుడు వేణు స్వామి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వేణు స్వామి పేర్కొన్నారు. గతంలో నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని వేణు స్వామి జోష్యం చెప్పారు. వీరిద్దరూ కూడా విడాకులు తీసుకుంటారని జ్యోతిష్యం చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మ‌హిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

దీనిపై తెలంగాణ ఉమెన్ కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ వేణు స్వామి హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు.. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉమెన్ కమిషన్ వేణు స్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలోనే నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరైన వేణు స్వామి.. తన వ్యాఖ్య‌ల‌ను ఉపసంహ‌రించుకున్నట్లు తెలిపారు. అలాగే వేణుస్వామి త‌న వ్యాఖ్య‌ల‌పై ఉమెన్ కమిషన్‌ను క్షమాపణ కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతం కావొద్దని ఉమెన్ కమిషన్ వేణు స్వామిని హెచ్చరించింది.

Next Story