వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం ప్రసాదాల జాబితాలో మరో ప్రసాదాన్ని చేర్చింది. ఆదివారం నుంచి భక్తులకు 'సీరా ప్రసాదం' పంపిణీని ఆలయ అధికారులు ప్రారంభించారు. 100 గ్రాముల సిరా ప్రసాదం కోసం 20 రూపాయల నిర్ణీత ధర ఫిక్స్ చేశారు. అంతకుముందు ఆలయంలో లడ్డూ, పులిహోర రూపంలో మాత్రమే ప్రసాదం అందించేవారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి, అర్చకులు పూజలు నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. భక్తులతో మమేకమై సిరా తీపి, రుచి, నాణ్యత గురించి ఆమె అభిప్రాయాన్ని సేకరించారు.