హైదరాబాద్‌లో మహాశివరాత్రి రోజున అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..

హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది.

By Knakam Karthik  Published on  26 Feb 2025 12:36 PM IST
Telugu News, Hyderabad, Amberpet Flyover, Vehicles Allowed

హైదరాబాద్‌లో మహాశివరాత్రి రోజున అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్..

హైదరాబాద్ వాసులకు సిటీలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. గోల్నాక చర్చి నుంచి ఛే నంబర్ మీదుగా అంబర్ పేట్ వరకు నిర్మించిన ఈ ఫ్లై ఓవర్‌ పై నేటి నుంచి వాహనాలు అనుమతిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా పర్వ దినం రోజు ప్రయాణికులకు ఎంతో అవసరమైన అంబర్ పేట్ ఫ్లై ఓవర్ వాహనదారుల కోసం ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ జాప్యం వల్లే అంబర్ పేట్ ఫ్లైఓవర్ కింద రోడ్డు పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ నుంచి వాహనాలను అనుమతించి కింద రోడ్ల నిర్మాణం, పచ్చదనం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ పనులు పూర్తయ్యాక అధికారికంగా ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. గోల్నాక చర్చి నుంచి ఛే నంబర్, శ్రీరమణ కూడళ్ల మీదుగా నిర్మించిన 1.5 కి.మీ. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

కాగా ఈ ఫ్లై ఓవర్‌కు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ 2018లో శంకుస్థాపన చేశారు. అయితే కోవిడ్ మహమ్మారితో సహా అనేక సాంకేతిక కారణంగా ఫ్లై ఓవర్ పనులు 2021 పనులు ప్రారంభం కాలేదు. మొదట 2023లో పూర్తి కావాల్సి ఉంది. వరంగల్ హైవే మీదుగా నగరానికి వచ్చే ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి మరియు ట్రాఫిక్ను మెరుగుపరచడానికి ఈ ఫ్లైఓవర్ రూపొందించబడింది. ఫ్లైఓవర్ కోసం GHMC 277 ఆస్తులను స్వాధీనం చేసుకుంది. కోర్టుల ముందు ఆరు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కారణాల వల్ల పనులు ఆలస్యం అయ్యాయని అధికారులు తెలిపారు.

Next Story