తెలంగాణలో 1.5 కోట్లు దాటిన వాహనాల సంఖ్య

Vehicle population crosses 1.5 crore in Telangana. హైదరాబాద్: ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో కొత్త వాహనాల హైదరాబాద్

By అంజి  Published on  14 Feb 2023 1:19 PM IST
తెలంగాణలో 1.5 కోట్లు దాటిన వాహనాల సంఖ్య

హైదరాబాద్: ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో కొత్త వాహనాల హైదరాబాద్ నగరంలో చేరుతున్నాయి. తెలంగాణలో మొత్తం రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య 1.51 కోట్లు దాటింది. రాష్ట్ర రవాణా శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. తెలంగాణలోని 1.51 కోట్ల వాహనాల్లో, మోటార్ సైకిళ్లు, కార్లు కలిపి 85 శాతానికి పైగా ఉండగా, 5 శాతం ట్రాక్టర్లు, మిగిలిన 10 శాతం ఇతర వాహనాలకు సంబంధించినవి. నవంబర్ 2022 నాటికి తెలంగాణలో మొత్తం రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య 1,51,13,129.

వీటిలో దాదాపు మొత్తం వాహనాల్లో 73 శాతం మోటార్‌సైకిళ్లు కాగా, కార్లు, క్యాబ్‌లు మొత్తం వాహనాలు 13.6 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొత్తం మీద 1.51 కోట్ల వాహనాల్లో ద్విచక్ర వాహనాలు 1.11 కోట్లు, కార్లు 19.45 లక్షలు, ట్రాక్టర్లు, ట్రైలర్లు 6.8 లక్షలు, గూడ్స్ క్యారేజీలు 5.9 లక్షలు, ఆటో రిక్షాలు 4.48 లక్షలు. హైదరాబాద్‌లో 77 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వీటిలో 57 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు, 13.76 లక్షల కార్లు ఉన్నాయి. డేటా ప్రకారం.. గడిచిన 12 సంవత్సరాల వ్యవధిలో నగరంలో వాహనాల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇందులో మహమ్మారి సమయం కూడా ఉంది.

నివేదికల ప్రకారం.. 2020, 2022 మధ్య నగరంలో వాహనాల జనాభాలో 18 శాతం పెరుగుదల కనిపించింది. ఈ సంవత్సరాల్లో సుమారు 14 లక్షల వాహనాలు నమోదయ్యాయి. 2019లో నగరంలో దాదాపు 64,02,482 వాహనాలు ఉన్నాయి. 20 నెలల్లో అంటే ఆగస్టు 2022 నాటికి వాహనాలు 77,65,487కి పెరిగాయి. ఇది సుమారుగా 13,63,005 (13 లక్షలు) పెరిగింది. సగటున రోజుకు 2,300 కొత్త వాహనాలు నమోదయ్యాయి. కొన్నేళ్లుగా తెలంగాణ కొత్త వాహనాలు, వాటి రిజిస్ట్రేషన్లలో నిరంతర వృద్ధిని నమోదు చేస్తోందని రవాణాశాఖ సీనియర్ అధికారులు తెలిపారు.

మంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్రం ప్రధాన ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడం వల్ల వాహనాల వేగవంతమైన వృద్ధిని సాధించగలిగామని వారు తెలిపారు. సుమారు కోటి జనాభాకు ప్రజా రవాణా 35 లక్షల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తుందని ట్రాఫిక్ పోలీసు వర్గాలు తెలిపాయి. అందువల్ల, ఇతర వ్యక్తులు చాలా మంది రోజువారీ ప్రయాణానికి తమ సొంత వాహనాలను ఎంచుకుంటారు.

Next Story