హైదరాబాద్‌లో వాన్‌గార్డ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్..2300 ఏఐ, డేటా జాబ్స్‌పై దృష్టి

అంతర్జాతీయ పెట్టుబడి నిర్వహణ సంస్థ అయిన వాన్‌గార్డ్ సోమవారం భారతదేశంలో తన మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ని హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

By Knakam Karthik
Published on : 31 March 2025 11:44 AM

Telangana, Cm Revanthreddy, Vanguard, first India office in Hyderabad

హైదరాబాద్‌లో వాన్‌గార్డ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్..2300 ఏఐ, డేటా జాబ్స్‌పై దృష్టి

అంతర్జాతీయ పెట్టుబడి నిర్వహణ సంస్థ అయిన వాన్‌గార్డ్ సోమవారం భారతదేశంలో తన మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ని హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇవాళ వాన్ గార్డు కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆ సంస్థ సీఈవో సలీమ్ రామ్ జీ, సీఐఓ ఐటీ విభాగం ఎండీ నితన్ టాండన్, చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ జాన్ కౌచర్, జీసీసీ-వాన్ గార్డు ఇండియా ప్రిన్సిపాల్ హెడ్ వెంకటేశ్ నటరాజన్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడుల అంశంపై చర్చించారు.

దేశంలోనే తొలి కార్యాలయం హైదరాబాద్ లోనే స్థాపించనున్నట్లు వ్యాన్ గార్డు సంస్థ వెల్లడించింది. దీంతో హైదరాబాద్ కార్యాలయంలో 2,300 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఏఐ, డేటా సెంటర్, మొబైల్ ఇంజినీరింగ్ నిపుణులకు అవకాశాలు రానున్నాయి. ఈ ఏడాది చివరలో హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభిస్తామని, రాబోయే నాలుగు సంవత్సరాలలో 2,300 మంది సభ్యులను నియమించుకుంటామని వాన్‌గార్డ్ తెలిపింది. హైదరాబాద్ క్యాంపస్ కోసం AI మరియు మొబైల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలపై వాన్‌గార్డ్ దృష్టి పెట్టనుంది.

Next Story