Hyderabad: బోయిన్‌పల్లి రోడ్డు ప్రమాదం.. కంటతడి పెట్టిస్తున్న వైష్ణవి చివరి మాటలు

హైదరాబాద్‌: బోయిన్ పల్లి ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని వైష్ణవి.. సుచిత్ర రష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.

By అంజి  Published on  3 Aug 2023 12:34 PM IST
bowenpally, road accident, Hyderabad

Hyderabad: బోయిన్‌పల్లి రోడ్డు ప్రమాదం.. కంటతడిపెట్టిస్తున్న వైష్ణవి చివరి మాటలు

హైదరాబాద్‌: బోయిన్ పల్లి ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని వైష్ణవి.. సుచిత్ర రష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. 'నాన్న ఎలా ఉన్నాడు' అని చివరి సారిగా మాట్లాడిన వైష్ణవి కన్నుమూసింద. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలేజీకి బయలుదేరిన కూతురిని బస్సు ఎక్కించడానికి తీసుకు వెళ్తుండగా తండ్రి, కూతురు ఇద్దరు బైక్ పై నుండి జారీ కింద పడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది.

కానాజీగూడకు చెందిన వైష్ణవి అనే యువతి ఎం ఎన్ ఆర్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. బోయిన్‌పల్లి చౌరస్తా వద్ద బస్సు ఎక్కడానికి వైష్ణవి తన తండ్రితో కలిసి బైక్ పై వస్తుండగా మట్టి రోడ్డు నుండి మెయిన్ రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఒక్కసారిగా బైక్ పై నుండి తండ్రి కూతుర్లు జారీ కింద పడిపోయారు. అదే సమయంలో బైక్ వెనుక నుంచి వచ్చిన డీసీఎం అత్యంత వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. దీంతో కూతురు వైష్ణవి డీసీఎం కింద పడిపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వైష్ణవిని దగ్గర్లో ఉన్న ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు.

విషమ పరిస్థితిలో సైతం తండ్రి ఎలా ఉన్నాడంటూ వైద్యులను ప్రశ్నించింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నా కూడా తన తండ్రి కోసం ఆమె పడుతున్న తపనను చూసి అందరూ కన్నీటి పర్వమయ్యారు. తండ్రికి కూడా గాయాలు కావడంతో అతన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story