అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం : పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్

Vaibhav Gaikwad IPS who took charge as DCP of Peddapalli. పెద్దపల్లి జోన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామ‌ని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ పేర్కొన్నారు.

By Medi Samrat
Published on : 28 Jan 2023 1:43 PM IST

అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాం : పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్

పెద్దపల్లి జోన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటామ‌ని పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని ఆయ‌న అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్ (ఐపిఎస్) శ‌నివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద‌ర్భంగా పెద్దపల్లి జోన్ కు చెందిన పోలీస్ అధికారులు డీసీపీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా డీసీపీ పెద్దపల్లి జోన్ పరిధిలోని పోలీస్ అధికారులతో మాట్లాడి భౌగోళిక పరిస్థితులను, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుదూ.. ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. డీసీపీని కలిసిన వారిలో గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, సతీష్, వేణుగోపాల్, చంద్రశేఖర్, రమేష్ బాబు తో పాటు ఎస్సైలు ఉన్నారు.



Next Story