కేసీఆర్ దళితుడ్ని సీఎం చేయలేదు కాబట్టి.. ఆ ఉత్సవాలు చెయ్యాలి

V Hanumantha Rao Praises Damodaram Sanjeevaiah. డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు

By Medi Samrat  Published on  24 Jan 2022 9:21 AM GMT
కేసీఆర్ దళితుడ్ని సీఎం చేయలేదు కాబట్టి.. ఆ ఉత్సవాలు చెయ్యాలి

డబ్బులు సంపాదించడానికే రాజకీయాల్లోకి వస్తున్నారని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ హనుమంతరావు అన్నారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాల నిర్వ‌హ‌ణ‌పై కాంగ్రెస్ నేతలు లక్డికాపూల్ అశోక్ హోటల్ లో సమావేశమ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. రాజకీయల్లోకి వచ్చేవారు డబ్బులు సంపాదించడానికి రావద్దు.. సేవ చెయ్యడానికి రావాలి అని పిలుపునిచ్చారు.

నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి స్వ‌ర్గీయ‌ దామోదరం సంజీవయ్య అని వీహెచ్ కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల‌ ప్రభుత్వాలు శత జయంతి ఉత్సవాలు చెయ్యాలని ఆయ‌న డిమాండ్ చేశారు. ఆనాటి రాజకీయ నాయకులను అంద‌రూ ఆదర్శంగా తీసుకొవాలని హితువు ప‌లికారు. దామోదరం సంజీవయ్యకి సొంత ఇల్లు లేదని తెలియ‌జేశారు. కేసీఆర్ దళితుడ్ని సీఎం చేయలేదు కాబట్టి.. దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు చెయ్యాలని హనుమంతరావు అన్నారు.

ఈ స‌మావేశానికి మాజీ పీసీసీ అద్యక్షులు పొన్నాల లక్ష్మయ్య , ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యే శ్రీదర్ బాబు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, గడ్డం వినోద్, మాజీ ఎంపి హర్షకుమార్, కిషన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సంజీవ్ రావు, ప్రముఖ జర్నలిస్టు రామచంద్ర మూర్తి, పలువురు నేతలు హాజ‌ర‌య్యారు.


Next Story
Share it