పెరిగిన పెట్రోల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ హైదరాబాద్ లక్డీకాపూల్ పెట్రోల్ బంక్ ముందు రోడ్డుపై కూర్చొని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిరసన తెలిపారు. కార్యక్రమంలో పెరిగిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను వీహెచ్ వాహనదారులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక సామాన్యుడి నడ్డి విరిచేలా పెట్రోల్ ధరలు భారీగా పెంచారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో 50 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 110 రూపాయలకు చేరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ రెండు ప్రభుత్వాలు దేశ ప్రజలను గ్యాస్, పెట్రోల్ పేరుతో దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీది ఆమాద్మీ ప్రభుత్వం కాదని.. కార్పోరేట్ ప్రభుత్వం అని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని వీ. హనుమంతరావు తెలిపారు.