అంబేద్కర్ ఆలోచనలు తెలంగాణలో అమలు కావడం లేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ప్రజల పక్షాన ఉండే ఒక సర్పంచ్ పై కేసు పెట్టారని.. అధికారులను సస్పెండ్ చేయకపోతే చలో ఆత్మకూర్ కి వెళతామని హెచ్చరికలు పంపారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలపై ఆధిపత్యం కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు 2023లో ప్రజలు గుణపాఠం చెబుతారని వీహెచ్ జోష్యం చెప్పారు. డిసెంబర్ 9 తరువాత హనుమంతరావు వరి కుప్పల దగ్గరే ఉంటాడని అల్టిమేటం జారీచేశారు. సోనియాగాంధీ పుట్టిన రోజు తర్వాత దాన్యం ఎట్లా కొనరో మేము చూస్తామని.. ఎస్సీ, బీసీలపై దౌర్జన్యం జరుగుతుందని.. తిరగబడే రోజు వస్తుందని వీ. హనుమంతరావు అన్నారు.