ఆ అబద్ధాలు విని ప్రజలు ఛీ ఛీ అంటున్నారు

V Hanumantha Rao Fires On CM KCR. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ ఎంపీ

By Medi Samrat  Published on  8 Oct 2021 8:19 AM GMT
ఆ అబద్ధాలు విని ప్రజలు ఛీ ఛీ అంటున్నారు

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ. హన్మంతరావు అన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్దాలు చెప్పడం తొలిసారి వింటున్నాన‌ని.. గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలని అన్నారు. 2014 ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసిన సందర్భంగా దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఎప్పుడు చెప్పలేదనడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత రూ.10 లక్షలు ఎప్పుడు ఇస్తానన్న అని అంటారేమో అని ఎద్దేవా చేశారు.

54శాతం బీసీలు ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చెప్పార‌ని.. సమగ్ర కుటుంబ సర్వేనే ఢిల్లీకి పంపించాల‌ని అన్నారు. ముఖ్యమంత్రి అబద్ధాలు విని ప్రజలు ఛీ ఛీ అంటున్నారని.. చిన్నజీయర్ స్వామిని కలిసి కేసీఆర్ అబద్ధాలు అడకుండా బోధించాలని కోరుతాన‌ని అన్నారు. గవర్నర్ బతుకమ్మ సంబరాలల్లో పాల్గొని బతుకమ్మ ఆడటం చాలా సంతోషమ‌ని అన్నారు. బతుకమ్మల మీద నుంచి కారు తీసుకెళ్లిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కు ఈ విషయంపై ఫిర్యాదు చేస్తాన‌ని తెలిపారు.


Next Story