తీన్మార్ మల్లన్నపై డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటుంది : వీహెచ్‌

తీన్మార్ మల్లన్న వ్యాఖ్య‌ల‌పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకుంటార‌ని మాజీ ఎంపీ వీ హనుమంత రావు తెలిపారు.

By Medi Samrat  Published on  5 Feb 2025 2:40 PM IST
తీన్మార్ మల్లన్నపై డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటుంది : వీహెచ్‌

తీన్మార్ మల్లన్న వ్యాఖ్య‌ల‌పై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం తీసుకుంటార‌ని మాజీ ఎంపీ వీ హనుమంత రావు తెలిపారు. తీన్మార్ మల్లన్న విషయంలో డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటదన్నారు. రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్ అని మోదీ అంటున్నారు.. మోదీ వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాన‌న్నారు.. అయోధ్యలో రాముని తలుపు తెరిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని మోహన్ భగవత్ అంటుండు.. మోహన్ భగవత్ మాటలకు అర్థం ఏంటో మోదీ చెప్పాలన్నారు.

జనాభా ప్రాతిపదికన కులగణన జరగాలని మోదీని కలిసినా చేయలేదు.. కానీ రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసిండు.. ఇది యావత్ భారత దేశానికి దిక్చుచి అని పేర్కొన్నారు. దేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే కులగణన చేసిండు.. అన్ని రాష్ట్రాలలో కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఆలోచనగా పేర్కొన్నారు.

ఎస్సీ వర్గీకరణ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తుండు.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు నిధులు కేటాయించినట్లేన‌న్నారు. బీసీ సబ్ ప్లాన్ పెట్టి 25వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన 76 సంవత్సరాల తరవాత బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఓబీసీ కన్వీనర్‌గా సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నాన‌న్నారు.

Next Story