రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా.. ప్రజలను చైతన్యం చేస్తా..

V Hanumantha Rao Comments On BC Census. దేశంలో బీసీ జనగణన జరపాలని గతంలో మూడు సార్లు మోదీని కలిసి కోరిన‌ట్లు మాజీ ఎంపీ

By Medi Samrat  Published on  10 Nov 2022 8:20 AM GMT
రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా.. ప్రజలను చైతన్యం చేస్తా..

దేశంలో బీసీ జనగణన జరపాలని గతంలో మూడు సార్లు మోదీని కలిసి కోరిన‌ట్లు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు తెలిపారు. బీసీ జనగణన విష‌య‌మై ఇప్పటి వరకు మోదీ నిర్ణయం తీసుకోలేదని.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దేశంలో బీసీ లకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. బీసీ జనగణన జరగాలి .. రిజర్వేషన్లు పెంచాలని ఆయ‌న డిమాండ్ చేశారు. క్రీమిలేయర్ వల్ల బిసీలు నష్టపోతున్నారు. మోదీ బీసీ అయివుండి ఆ వర్గాలకు ఏమీ చేయలేదని విమ‌ర్శించారు. కేవలం మత్రివర్గంలో బీసీ లకు అవకాశం కల్పిస్తే న్యాయం జరగదని అన్నారు. బీసీ జనగణన జరపకపోతే మోదీపై తిరుగుబాటు తప్పదని హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ఇదే డిమాండ్ తో మోదీని నిలదీసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా.. బీసీ జనగణనపై ప్రజలను చైతన్యం చేస్తాన‌ని అన్నారు.

గవర్నర్ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పడంపై వీహెచ్ స్పందిస్తూ.. గవర్నర్ కే ఇటువంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్ర‌శ్నించారు. గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయాలని.. కేవలం మీడియాకు చెబితే లాభం ఏంటి అని కామెంట్ చేశారు. గవర్నర్ నిస్సహాయత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. గవర్నర్ చెబుతున్న ఇష్యూ లపై కేంద్రం స్పందించాలని అన్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితాలపై పీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు.. పీసీసీ చీఫ్ మాట్లాడిన తరువాత మళ్ళీ నేను దానిపై మాట్లాడనని వీహెచ్ అన్నారు.


Next Story