ఎస్టీ కోటా పెంపు, గిరిజన బంధుపై కేసీఆర్‌ హామీలు బూటకం: ఉత్తమ్‌

Uttamkumar Reddy Fire On CM KCR. ఉద్యోగ, విద్యలో కోటా పెంపుపై ముఖ్యమంత్రి నకిలీ హామీలతో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గాలను

By Medi Samrat  Published on  18 Sep 2022 11:21 AM GMT
ఎస్టీ కోటా పెంపు, గిరిజన బంధుపై కేసీఆర్‌ హామీలు బూటకం: ఉత్తమ్‌

ఉద్యోగ, విద్యలో కోటా పెంపుపై ముఖ్యమంత్రి నకిలీ హామీలతో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం ఉన్న 6% రిజర్వేషన్ల ను 10% కు పెంచడం.. 'గిరిజన బంధు' పథకం ద్వారా అర్హులైన ఎస్టీ కుటుంబాలకు రూ.10 లక్షల సాయం లాంటివి మరో ఎండమావి లాంటిదని ఆయన అన్నారు.

ఎస్టీ కోటాను 10%కి పెంచాలని 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని, ఉద్యోగాలు, విద్యలో ఎస్టీ కోటాను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని గత ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రికి అనేక సార్లు ఫిర్యాదు చేశాను. 6% నుండి 10%. పెంచాలనే అంశాన్ని నేను గతంలో చాలా సార్లు పార్లమెంటులో లేవనెత్తానని.. ఈ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా ఒక వినతిపత్రం కూడా ఇచ్చానని అన్నారు, ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎస్టీ కోటా పెంపునకు జీవో జారీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారని కానీ ఆయన ప్రకటనపై అనుమానాలు వ్యక్తం ఆవుతున్నాయని అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కేసీఆర్‌ ఎప్పుడూ పన్నుతున్న ట్రిక్‌'' అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

ఎస్టీలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒక్కరోజు కూడా ఎదురుచూడకుండా వెంటనే జీవో జారీ చేయాలని అన్నారు. ''సాధారణ జీవో జారీ చేయడానికి వారం రోజులు ఆగాల్సిన అవసరం ఏముంది?.. ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉంటే గంటలోపే పూర్తి చేయొచ్చు.. అయితే కేసీఆర్ మాత్రం ఆ సాకుతో మరింత జాప్యం చేసే విధంగా ప్రకటనను కాలయాపన చేస్తున్నారని అన్నారు.

జూన్-జూలై 2014లోనే జిఓ జారీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ కోటాను 10%కి పెంచితే ఏంతో మందికి లబ్ది జరిగేదని అన్నారు. పెంచడంలో జాప్యం వల్ల గత ఎనిమిదేళ్లలో ఎస్టీ కమ్యూనిటీ వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ కళాశాలల్లో లక్షలాది సీట్లను కోల్పోయారని. ఈ నష్టానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్‌తో 10% పెంచిన ఎస్టీ కోటాను అమలు చేయాలని సూచించారు.

బీజేపీ ప్రభుత్వం గిరిజన వ్యతిరేకి అని, ఎస్టీ కోటాను 10%కి పెంచడాన్ని ఎప్పటికీ ఆమోదించదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. "భారతదేశం అంతటా ఉన్న రిజర్వేషన్లను అంతం చేయడానికి మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పేద SC, ST, BC వర్గాలకు ప్రయోజనం చేకూర్చే ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడానికి మాత్రమే అన్ని రంగాలు, PSU ల ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తోందని అన్నారు. కాబట్టి, ఇది కేవలం ఒక ఎస్టీలు, ఎస్సీలు, ఇతర వర్గాల కోటాల పెంపు ప్రతిపాదనలకు బిజెపి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశించడం సమయం వృధా," అని ఆయన అన్నారు.

పోడు భూముల సమస్యను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టించిందని అన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న ఎస్టీలకు గత కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు కల్పించిందన్నారు. హరితహారం తదితర కారణాలతో గిరిజనుల నుంచి పోడు భూములను లాక్కున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. పోడు భూములపై ​​గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పించడం ఎస్టీలకు కేసీఆర్ చేస్తున్న ఉపకారం కాదని, హక్కుల కోసం పోరాడుతున్న వేలాది మంది ఎస్టీల ముందు ఆయన ప్రభుత్వం లొంగిపోయిందన్నారు. తెలంగాణలో పోడు భూముల ఆందోళన సందర్భంగా గిరిజనులపై నమోదు చేసిన కేసులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

''తెలంగాణలో దళిత బంధు పథకం కింద దాదాపు 17 లక్షల పేద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల సాయం అందజేస్తామన్న కేసీఆర్‌ ప్రభుత్వం 5 వేల కుటుంబాలకు కూడా సాయం చేయలేదన్నారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలను ప్రతిపాదిత 'గిరిజన్ బంధు' పథకం కింద లబ్ధిదారులుగా ఎంపిక చేసి, అన్ని ఎస్టీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తామంటూ ప్రచారం కల్పించారని విమర్శించారు. ఇది కేసీఆర్ చేస్తున్న మరో మోసం అని అన్నారు. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేసిన కేసీఆర్, మునుగోడు ఉప ఎన్నికల్లో గిరిజన బంధు పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు.

పేద ఎస్టీ కుటుంబాలకు హామీ ఇచ్చిన మూడెకరాల భూమి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కొత్త గ్రామ పంచాయతీలుగా మారిన లంబాడా తాండాలకు మౌలిక వసతుల కల్పనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.




Next Story