టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

Uttam Kumar Reddy Resigns For TPCC. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రదేశ్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్ష ప‌ద‌వికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

By Medi Samrat  Published on  4 Dec 2020 7:38 PM IST
టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రదేశ్‌ కమిటీ(టీపీసీసీ) అధ్యక్ష ప‌ద‌వికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాజీనామా చేశారు. గ్రేటర్‌ ఫలితాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం వెల్లడైన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 2015న ఉత్తమ్‌ టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.






Next Story