తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన నియామకం
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
By Knakam Karthik
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన నియామకం
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ బోర్డుకు ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకా ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. క్రీడా రంగాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఈ బోర్డును నియమించింది.తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని ఉపాసన ట్వీట్ ద్వారా తెలిపారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు కొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రైవేట్-పబ్లిక్ పార్టనర్‌షిప్‌కు తెలంగాణ సర్కార్ పెద్దపీఠ వేసింది. క్రీడా రంగాలను ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశేష అనుభవం ఉన్నవారితో ఓ బోర్డును ఏర్పాటు చేసింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ను నియమించింది. ఈ బోర్డుకు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకాను ఛైర్మన్‌గా నియమించారు. కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెలకు అవకాశం కల్పించారు. బోర్డు సభ్యులుగా సన్ టివీ నెట్‌వర్క్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్, ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, పుల్లెల గోపిచంద్, భూటియా, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి తదితరులను నియమించారు.
ఈ మేరకు ట్వీట్ చేసిన ఉపాసన కొణిదెల సీఎం రేవంత్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంజయ్ గోయెంకా ఛైర్మన్‌గా ఉన్న బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. 'తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దేందుకు సంజయ్ గోయెంకాతో పాటు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్‌గా ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. నన్ను నియమించిన సీఎం రేవంత్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను (PPP) నిర్మించడానికి, రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ఇది ఒక శక్తివంతమైన అడుగు' అని ఉపాసన ట్వీట్ చేశారు.
Honoured to be the Co Chairman of the Sports Hub of Telangana alongside @sanjivgoenka Ji to shape Telangana into a global sports force.Grateful to Shri @revanth_anumula Garu and the Government of Telangana for this bold vision.This is a powerful step towards building… pic.twitter.com/Xz3k1LWFnw
— Upasana Konidela (@upasanakonidela) August 4, 2025