హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ కార్పొరేటర్‌లు, పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పని చేయడం లేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రికి గౌరవంగా సమాధానం చెప్పుతామన్నారు.
ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి యుద్దం చేస్తామంటే మేము వార్ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పైన అన్ని విషయాలతో సమగ్రంగా త్వరలోనే మాట్లాడుతానని అన్నారు. ఇక దేశంలో అన్ని మ్యూజియంలను అభివృద్ధి చేస్తామని, కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సెంట్రల్ విస్టాలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ లో కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేస్తామని, జమ్మూ కాశ్మీర్ చరిత్ర పై మ్యూజియం ఏర్పాటు, బిర్సా ముండా చరిత్ర పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ ట్రైబల్ మ్యూజియం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని అలాట్ చేయలేదని తెలిపారు. ఈ నెల 15, 16 అంతర్జాతీయ మ్యూజియం సదస్సును హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ద్వారా వివిధ దేశాలలో మ్యూజియాలను ఎలా నిర్వహిస్తున్నారో తెలుసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.