కేసీఆర్ కు దేశం, తెలంగాణ కన్నా కుటుంబమే ఎక్కువ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

Union Minister Prahlad Joshi Comments On CM KCR. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

By Medi Samrat  Published on  23 Sept 2022 8:30 PM IST
కేసీఆర్ కు దేశం, తెలంగాణ కన్నా కుటుంబమే ఎక్కువ: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పాలన దారుణంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు దేశం, తెలంగాణ కన్నా కుటుంబమే ఎక్కువ అని అన్నారు. బియ్యం రీసైక్లింగ్ లో టీఆర్ఎస్ నేతలు ఉన్నారనే అభియోగాలు వచ్చాయని.. కేసీఆర్ నీతి అయోగ్ మీటింగ్ కి ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆవాస్ యోజన ఇల్లు కట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ ఎంఐఎం తో కలిసి మెట్రో రైలు సర్వీసులను పాతబస్తీకి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాగ్ రిపోర్టుపై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని అడిగారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తానని అన్న కేసీఆర్ ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. హైదరాబాద్ లోని బీజాపూర్ హైవే కి భూసేకరణ చేయకపోవడంతో పనులు జరగడం లేదు అన్నారు.


Next Story