'నేను కూడా నోటీసులు పంపిస్తా'.. కేటీఆర్‌ లీగల్‌ నోటీసుకు బండి సంజయ్‌ రిప్లై

కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు.

By అంజి  Published on  23 Oct 2024 1:25 PM IST
Union Minister Bandi Sanjay, KTR, legal notice, Telangana

'నేను కూడా నోటీసులు పంపిస్తా'.. కేటీఆర్‌ లీగల్‌ నోటీసుకు బండి సంజయ్‌ రిప్లై

హైదరాబాద్ : కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. వారంలోగా క్షమాపణ చెప్పకపోతే లీగల్‌ యాక్షన్‌ తప్పదని స్పష్టం చేశారు. తాను డ్రగ్స్‌ తీసుకుంటానని, ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డానని సంజయ్‌ నిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు.

కేటీఆర్‌ తనకు లీగల్‌ నోటీస్‌ పంపడంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడనని స్పష్టం చేశారు. తనను అవమానిస్తే, తాను బదులిచ్చానని, విమర్శలకు నోటీసులే సమాధానమా? అయితే తాను కూడా నోటీసులు పంపిస్తానని అన్నారు. కాచుకో.. మాటకు, మాట.. నోటీసుకు నోటీసులతోనే బదులిస్తానని బండి సంజయ్‌ అన్నారు.

Next Story