ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాల్

Union Home Minister Amit Shah called MP Dharmapuri Arvind. తెలంగాణ బీజేపీ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కాన్వాయ్‌పై

By Medi Samrat  Published on  15 July 2022 8:11 PM IST
ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాల్

తెలంగాణ బీజేపీ నేత‌, నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కాన్వాయ్‌పై శుక్ర‌వారం జ‌రిగిన దాడిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. అర్వింద్ కాన్వాయ్‌పై దాడి జ‌రిగింద‌న్న విష‌యం తెలిసిన త‌ర్వాత ఎంపీకి అమిత్ షా స్వ‌యంగా ఫోన్ చేశారు. ఈ సంద‌ర్భంగా దాడి జ‌రిగిన తీరు, అనంత‌ర ప‌రిణామాల‌పై అమిత్ షా ఆరా తీశారు. బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అధికార టీఆర్ఎస్ నేతలు ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు దిగుతున్నార‌ని ఆయన ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నియోజ‌క‌వర్గ ప‌రిధిలో తాను ఎక్క‌డ తిరిగినా.. త‌న‌పై దాడులు చేయాల‌ని టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వం ఆ పార్టీ ఎమ్మెల్యేల‌కు ఆదేశాలు జారీ చేసింద‌ని అర్వింద్ తెలిపారు.

బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండి గ్రామంలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీని టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.











Next Story