- ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారుడి నిరసన
- ట్రాఫిక్ చలాన్లు భరించలేక బైక్‌కు నిప్పుపెట్టిన వాహనదారుడు
- ఆదిలాబాద్ పంజాబ్ చౌరస్తా సెంటర్‌లో బైక్‌కు నిప్పు
తరచూ చలాన్ల పేరుతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారితో పాటు అన్ని నిబంధనలు పాటిస్తున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా తన బైక్‌కు పోలీసులు తరచూ చలాన్లు విధిస్తున్నారని.. నడిరోడ్డుపై ఓ వ్యక్తి బైక్‌కు నిప్పు పెట్టాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో పంజాబ్ చౌరస్తా వద్ద జరిగింది. ఖానాపూర్‌కు చెందిన మక్బూల్. బైక్‌పై వెళ్తుండగా ఫొటో తీసి ఈ-చలాన్ వేశారు. అసహనానికి గురైన మక్బూల్ తన బండిని నడి రోడ్డుపై ఉంచి నిప్పు పెట్టాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే మంటలను అదుపు చేశారు. తరచూ చలాన్లు కట్టాలని ట్రాఫిక్ పోలీసులు అడుగుతున్నారని, చలాన్ల బాధను తట్టుకోలేకే బైక్‌కు నిప్పు పెట్టానని మక్బూల్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల వేస్తున్న చలాన్లు తనకు మోయలేని భారంగా మారయాని, గత కొన్ని రోజులుగా తరచూగా చలాన్లు విధిస్తున్నారని మక్బూల్ చెప్పారు.