పెద్దపల్లి జిల్లాలో విషాదం.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొని ఇద్దరు మృతి

రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లకు నీటిని, నీళ్ల ప్యాకెట్లను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇద్దరు వ్యక్తులను మృత్యువు కబళించి వేసింది

By Medi Samrat  Published on  14 Dec 2023 8:18 PM IST
పెద్దపల్లి జిల్లాలో విషాదం.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొని ఇద్దరు మృతి

రైళ్లలోనూ, రైల్వే స్టేషన్లకు నీటిని, నీళ్ల ప్యాకెట్లను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఇద్దరు వ్యక్తులను మృత్యువు కబళించి వేసింది. రైల్వే స్టేషన్ క్యాంటీన్‌లో వాటర్ క్యాన్స్ వేసి టీ తాగేందుకు రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొనడంతో ఇద్దరి ప్రాణాలు పోయాయి. పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ లో ఈ దారుణం చోటు చేసుకుంది. రాజు(40) యాకూబ్ (45) అనే ఇద్దరు వ్యక్తులు రైళ్లలో, క్యాంటిన్‌లలో వాటర్‌ సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎప్పటిలాగే వాటర్‌ ప్యాకెట్ల్ సరఫరా చేస్తుండగా ప్రమాదవశాత్తు ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ట్రెయిన్‌ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.

పట్టణంలోని ఓ ప్రైవేటు వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్న రాజు, యాకూబ్ అనే యువకులు తెలంగాణ సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొని రైల్వే స్టేషన్ లో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రెండో నెంబర్ ప్లాట్ ఫారం పై వాటర్ క్యాన్లు వేసి తిరిగి వస్తుండగా సంఘటన జరిగింది. సంఘటన స్థలానికి ఆర్పిఎఫ్ పోలీసులు చేరుకుని పరిశీలించారు.

Next Story